»Hyderabad Andhra Pradesh Woman Raped By Mixing Alcohol In Cool Drink
Crime News: మద్యం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి..మహిళపై అత్యాచారం!
ఓ యువకుడు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి డ్రింక్ ఓ మహిళకు ఇచ్చాడు. తరువాత ఆమెపై లైంగికదాడి చేశాడు. అంతే కాకుండా ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్‌మొయిల్ చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad, Andhra Pradesh woman raped by mixing alcohol in cool drink
Crime News: కూల్‌డ్రింక్(Cool Drink)లో మద్యం కలిపి వివాహితకు తాగించి ఆపై ఆత్యాచారాని పాల్పడి, అక్కడితో ఆగకుండా నగ్న వీడియోలు(Videos), ఫొటోలు(Photos) తీసి బాధితురాలిని బ్లాక్మెయిల్(Balackmial) చేసిన ఘటన హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషయంపై పోలీసులు ఆరాతీయగా అసలు బండారం బయటపడింది. ఆంధ్రప్రదేశ్(Andra Pradesh), కొనసీమా జిల్లాకు చెందిన బాధిత మహిళకు ఆన్లైన్ గేమ్ ద్వారా ఏపీకి చెందిన జాషువా, వాసాకుమార్ నర్సింహమూర్తి అనే ఇద్దరు వ్యక్తుల పరిచయమయ్యారు. ఈక్రమంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న జాషువాతో స్నేహాం ప్రేమగా మారి ఇద్దరు కలిసి 2020 జూన్ 10న పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న నర్సింహమూర్తికి ఇది నచ్చలేదు. తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. రోజు తన ప్రేమను తెలియజేస్తూ మెస్సెజ్‌లు పంపేవాడు. అతని మూలంగా భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో బాధితురాలు ఉద్యోగం చేస్తానని హైదరాబాద్(Hyderabad)కు వచ్చింది. బల్కంపేటలో తన స్నేహితురాలు ఉంటున్న ఫ్లాట్‌లో ఉండేది.
విషయం తెలుసుకున్న నర్సింహమూర్తి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. తన భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయ మాటలు చెప్పి అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్లో చేర్పించాడు. అంతే కాకుండా రహ్మత్‌నగర్ పరిధి జవహర్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. ఆమెను అక్కడికి పిలిపించి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించాడు. మత్తు ఎక్కిన తరువాత ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వీడియోలు, ఫొటోలు తీశాడు. అనంతరం బెదిరింపులు ప్రారంభించాడు. ఈ విషయాన్ని కక్కలేక మింగలేక బాధితురాలు ఆంధ్రప్రదేశ్‌లోని సొంతూరుకు వెళ్లింది. అయినా సరే వేధింపులు ఆగలేదు. దీంతో గతనెల 7న అక్కడే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మధురానగర్ ఠాణాకు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు సాగుతుందని అధికారులు పేర్కొన్నారు.