ఎట్టకేలకే క్రిష్ మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే వచ్చిన మూడు క్రిష్ సిరీస్ లు మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ క్రిష్-4(Krrish 4) గురించి 2014 నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్ర నిర్మాత, డైరెక్టర్ రాకేషన్ రోషన్(rakesh roshan) ఈ చిత్రం గురించి సరికొత్త అప్ డేట్ ఇచ్చారు.
హృతిక్ రోషన్(Hrithik Roshan) క్రిష్ సినిమాను అంత ఈజీగా మర్చిపోలేము. ఈ సూపర్ హీరో సినిమా అప్పట్లో ఇండయన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. ఇప్పటికే మూడు ఫ్రాంఛైజీలు వచ్చాయి. దీంతో క్రిష్ 4(Krrish 4) కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత 2022లో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమన్నారు. కానీ ఇప్పటి వరకు మరో అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ సూపర్ సిరీస్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది.
అయితే హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రస్తుతం పలు మూవీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సిద్ధార్థ్ ఆనంద్‌తో కూడిన ఫైటర్, ఆపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2 కూడా ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తైన తర్వాత క్రిష్ 4 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు హృతిక్ తండ్రి, క్రిష్ మూవీ దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్(rakesh roshan) స్పష్టం చేశారు. క్రిష్ 4 కోసం తన స్వంత సమయాన్ని వెచ్చిస్తున్నానని, తొందరపడటం లేదని పంచుకున్నారు. దీంతోపాటు స్క్రిప్ట్ కూడా అభివృద్ధి దశలో ఉందని వెల్లడించారు.
హాలీవుడ్ లేదా భారతీయ చిత్రాలలో ఎప్పుడూ ప్రయత్నించని కాన్సెప్ట్‌తో తాను వస్తున్నానని అందరికీ హామీ ఇచ్చాడు. ఈ చిత్రం భావోద్వేగాలతో ఎక్కువగా ఉంటుందని, తండ్రీ కొడుకుల ట్రాక్‌ను మరింత కలిగి ఉంటుందని ఆయన పంచుకున్నారు. కానీ ఈ చిత్రం మాత్రం 2024 ముగిసేలోపు మొదలు కావడం కష్టమేనని చెప్పారు. ఆ తర్వాత ఉండబోతుందని ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాకేష్ రోషన్(rakesh roshan) వెల్లడించారు.