»Horoscope Today Todays Horoscope December 9th 2023 Good News Will Be Heard
Horoscope Today : నేటి రాశిఫలాలు(December 9th 2023)..ఒత్తిడి తప్పదు
ఈ రోజు(December 9th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
మేషం:
ఈ రాశివారికి ఇది అన్ని రకాలుగా మంచి సమయం. కొన్ని వ్యవహారాలను చక్కబెడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంటుంది. ఆదాయం బావుంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.
వృషభం:
ఈ రాశివారు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితులు బావుంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగం సంతృప్తికరంగా సాగుతుంది. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. కోపాలు తగ్గించుకుంటే మంచిది. ఇతరులు మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడతారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మిథునం:
ఈ రాశివారికి కొత్త స్నేహితులతో పరిచయం కలుగుతుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాలతో సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి.
కర్కాటకం:
ఈ రాశివారికి ఉద్యోగంలో అనేక మార్పులు జరుగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. దాంపత్య జీవితంలో చికాకులు ఉంటాయి.
సింహం:
ఈ రాశివారికి కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు బావుంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయి.
కన్య:
ఈ రాశివారికి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఖర్చు అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి.
తుల:
ఈ రాశివారికి ఇదే మంచి సమయం. సంఘంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలతో సాగుతాయి. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చికం:
ఈ రాశివారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో అపార్థాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం బావుంటుంది.
ధనుస్సు:
ఈ రాశివారికి ఆదాయం బావుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. కుటుంబం వల్ల ఇరకాటంలో పడతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభం రాదు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు.
మకరం:
ఈ రాశివారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు శ్రమ తప్పదు.
కుంభం:
ఈ రాశివారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.
మీనం
ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. స్నేహితులకు సాయం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శుభవార్తలు వింటారు.