»Havana Syndrome In India A Disease That Destroys The Brain
Havana Syndrome: భారత్‌లోకి ‘హవానా సిండ్రోమ్’..మెదడును నాశనం చేసే వ్యాధి!
భారత్‌లో హవానా అలజడి మొదలైంది. దేశంలో హవానా సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయా? లేదా? అనేది విషయంలో దర్యాప్తు చేపట్టాలని స్వయంగా కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భారత్‌లోకి హవానా సిండ్రోమ్ (Havana Syndrome) వచ్చే అవకాశం ఉందని, మరో మూడు నెలల్లోగా దానిపై దర్యాప్తు చేపట్టాలని కర్ణాటక హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఆ విషయాన్ని పరిశీలిస్తామని కేంద్రం తరపు న్యాయవాది అంగీకరించారు. బెంగళూరుకు చెందిన అమర్నాథ్ చాగు పిటిషన్‌ను జూలై 27న కోర్టు కొట్టివేసింది. హవానా సిండ్రోమ్‌పై దర్యాప్తు చేపట్టి తీరాలని కోర్టు తీర్పునిచ్చింది.
హవానా సిండ్రోమ్ (Havana Syndrome) అనేది ఒక మానసిక ఆరోగ్య లక్షణం. ఈ లక్షణాలను ఇప్పటి వరకూ యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజెన్స్, విదేశాలలోని చాలా మంది ఎంబసీ అధికారులు అనుభించారు. సాధారణంగా శబ్దాలు లేకపోయినా బయటి నుంచి కొన్ని శబ్దాలు వినడం, వికారం కలగడం, వెర్టిగో, తలనొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనలు రాకపోవడం వంటి సమస్యలు హవానా సిండ్రోమ్ ప్రధాన లక్షణాలుగా చెప్పొచ్చు.
2016 చివరలో, హవానాలో యుఎస్ తన రాయబార కార్యాలయాన్ని తెరిచింది. అయితే ఒక ఏడాది తర్వాత కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు, రాయబార కార్యాలయ సిబ్బంది వారి మెదడులో అకస్మాత్తుగా ఒత్తిడిని అనుభవించినట్లు తెలిపారు. ఆ తర్వాత వారిలో నిరంతరంగా తలనొప్పి, దిక్కుతోచని స్థితి ఏర్పడటం, నిద్రలేమి సమస్యలు కలగడం జరుగుతుండేవి. ఇలాంటి సమస్యలు రావడాన్ని వైద్య నిపుణులు హవానా సిండ్రోమ్ (Havana Syndrome) అని అభివర్ణిస్తున్నారు.
ఈ హవానా సిండ్రోమ్ రావడానికి ఇంకా కచ్చితమైన కారణంగా నిర్ధారించబడలేదు. 2021లో ఇండియాకు వచ్చిన CIA అధికారి ఈ లక్షణాలను అనుభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 (గ్రీవెన్స్ రిడ్రెసల్) కింద పిటిషన్లో లేవనెత్తిన ఫిర్యాదులను అధికారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ వాదించగా దీనిపై కేంద్రం దర్యాప్తు చేపట్టనుంది.