ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ (andhra pradesh chief minister ys jagan), తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన (telugu desam party chief chandrababu naidu) తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు (telangana minister harish rao) పరోక్షంగా విరుచుకుపడ్డారు. తాను నిన్న చేసిన వ్యాఖ్యల పైన ఏపీ నేతలు (ap ministers) తప్పుబట్టడంపై దుయ్యబట్టారు. ఆయన బుధవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో (brs Athmeeya Sammelanam) పాల్గొని, మాట్లాడారు. తాను నిన్న చేసిన వ్యాఖ్యల పైన ఏపీ మంత్రులు (ap ministers) రాద్దాంతం చేస్తున్నారని, కానీ ఏపీకి చెందిన కొంతమంది కార్మికులకు రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని, అలా ఉంటే తెలంగాణలోనే కొనసాగించుకోవాలని సూచించానని చెప్పారు. తెలంగాణలో (telangana) ఏముందో ఇక్కడకు వచ్చి చూస్తే వారికి అర్థం అవుతుందని చెప్పారు. గత ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా (special status) తీసుకు వస్తామని చెప్పిన వైసీపీ ఇప్పుడు దాని గురించే మాట్లాడటం లేదని విమర్శించారు. హోదా కోసం గత టీడీపీ ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయేను వీడిందని, ఇప్పుడు అదే కేంద్రంతో దోస్తీ కట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాజకీయం కోసం అధికార పార్టీ, విపక్షాలు గాలికి వదిలేశాయని ధ్వజమెత్తారు.
ఆంధ్రలో మంత్రులు నిన్న ఇవాళ బాగా మాట్లాడుతున్నారన్నారు. నిన్న సంగారెడ్డి వద్ద ఆంధ్రా నుండి వచ్చిన కొంతమంది కార్మికులు సార్ మేం ఇక్కడే ఓటు తీసుకున్నామని తనతో చెప్పారని, దానికి తాను కూడా ఇక్కడే ఉండాలని వారికి చెప్పానని, ఈ సమయంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రాలో మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. దానికి తెలంగాణలో ఏముందని విమర్శలు గుప్పిస్తున్నారని.. కానీ ఏముందో ఇక్కడకు వచ్చి చూడాలన్నారు. ఏమున్నది అంటున్నావు కదా… పంటలు పెరిగాయి, కళ్యాణ లక్ష్మి, 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, ప్రతి రైతు ఎకరాకు రూ.10వేలు ఇచ్చే రైతు బంధు ఉంది, రైతు అనుకోకుండా చనిపోతే రూ.5 లక్షలు ఇచ్చే రైతు బీమా ఉంది, ప్రపంచ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ఉంది.. ఏపీ మంత్రి గారు అంటూ ఎద్దేవా చేశారు. నాడు ప్రత్యేక హోదా కోసం నాడు గళం విప్పిన మీరు.. ఇప్పుడు మాట్లాడటం లేదేం అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును తుక్కుకు అమ్మినా మాట్లాడలేని పరిస్థితుల్లో ఏపీ నేతలు ఉన్నారు. అధికార పక్షం అడగదు.. ప్రతిపక్షం ప్రశ్నించదని చెప్పారు. మేం చెప్పాలనుకుంటే చాలా చెబుతామని, అనవసరంగా మా జోలికి రావొద్దని, ఇంకా ఎంతో చెప్పగలమని హెచ్చరించారు.
కాగా, హరీష్ రావు నిన్న సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీ కార్మికులు ఆంధ్ర ప్రదేశ్ లో ఓట్లు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటు హక్కు తీసుకోవాలని, ఏపీ హాస్పిటల్స్, రోడ్లు, ఇక్కడి హాస్పిటల్స్, రోడ్ల పరిస్థితి చూడాలన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎవరి పాలన బాగుందో ప్రజలు ఆలోచించాలన్నారు. అభివృద్ధిలో తెలంగాణకు, ఆంధ్ర ప్రదేశ్ కు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఏపీలో కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవన్నారు. అందుకే తెలంగాణలో ఉన్న ఏపీ కార్మికులు ఓటు హక్కును ఇక్కడే రిజిస్టర్ చేసుకోవాలని, రెండు చోట్ల వద్దని సూచించారు. ఏపీలో అభివృద్ధి లేదని హరీష్ రావు చెప్పడంపై ఏపీ మంత్రులు భగ్గుమన్నారు.