హైదరాబాద్ (hyderabad) నుండి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (Vande Bharat Express) పట్టాలెక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్ – విశాఖ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (secunderabad visakhapatnam vande bharat express) మూడు నెలల క్రితం ప్రారంభమైంది. తాజాగా ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ (PM modi) తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సికింద్రాబాద్ – తిరుపతి (secunderabad – tirupati) మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు (Vande Bharat Express launched). ఇప్పుడు మూడో రైలు కూడా రానుంది. హైదరాబాద్ – బెంగళూరు (hyderabad – bengaluru) మధ్య కొత్త రైలును నడపాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఈ వందే భారత్ రైలు నడిపే అంశాన్ని బీజేపీ నేతలతో ప్రధాని మోడీ ప్రస్తావించారని తెలుస్తోంది. అయితే ఏ తేదీన ప్రారంభిస్తారో తెలియాల్సి ఉంది. ఈ రైలుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
కాచిగూడ నుండి బెంగళూరుకు పలు రైళ్లు నడుస్తున్నాయి. 570 కిలో మీటర్ల దూరాన్ని 11 గంటల్లో కవర్ చేస్తున్నాయి. అదే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వస్తే మాత్రం నాలుగు గంటల సమయం తగ్గుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్, తిరుపతి నుండి సేవలు అందిస్తున్న వందే భారత్ రైలుకు మంచి స్పందన లభిస్తోంది. కాచిగూడ – బెంగళూరు వందే భారత్ రైలు పైన మూడు నెలల క్రితమే రైల్వే అధికారులు సూచనలు చేసినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. త్వరలో కర్నాటక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రచారం కూడా వారికి కలిసి రావొచ్చునని అంటున్నారు.
హైదరాబాద్, బెంగళూరు రెండు టెక్ హబ్ నగరాలు. ఈ రెండు నగరాలను కలుపుతూ ప్రారంభమయ్యే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. సికింద్రాబాద్ నుండి మహారాష్ట్రలోని పుణేకు కూడా మున్ముందు మరో వందే భారత్ రావొచ్చునని అంటున్నారు. జనవరి 14న సికింద్రాబాద్ – విశాఖ, ఏప్రిల్ 8న తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ ప్రారంభమయ్యాయి. దేశంలో 13 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. కాగా, ప్రధాని మోడీ ఇటీవల తెలంగాణ వచ్చినప్పుడు రూ.11వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ-డెవలప్మెంట్ కోసం రూ.720 కోట్ల ఖర్చుతో మరింత ఆధునికీకరించనున్నారు. ప్రపంచస్థాయి స్టేషన్ గా మార్చనున్నారు.