»Good News For Alcohol Drinkers Liquor Prices Reduced In Telangana
Liquor Rates: మందుబాబులకు గుడ్ న్యూస్..తెలంగాణలో తగ్గిన మద్యం ధరలు
మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని(Tax) తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్ (Liquor)కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు(All Brands Rates) తగ్గనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది.
మద్యం ప్రియులకు తెలంగాణ(Telangana) సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు(Liquor Rates) తగ్గిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని(Tax) తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్ (Liquor)కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు(All Brands Rates) తగ్గనున్నట్లు తెలిపింది. ఫుల్ బాటిల్ పై రూ.40లు, హాఫ్ బాటిల్ పై రూ.20లు, క్వార్టర్ బాటిల్ పై రూ.10ల చొప్పున ధరలు తగ్గినట్లు సర్కార్ వెల్లడించింది.
కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్ పైన రూ.60ల వరకూ ధరలు(Liquor Rates) తగ్గించినట్లుగా ఆబ్కారీ అధికారులు తెలిపారు. తగ్గిన ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. అధిక ధరల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో(Telangana)కి లిక్కర్ (Liquor) అక్రమంగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం మద్యం ధరల(Liquor Rates)ను తగ్గించినట్లుగా ఆబ్కారీ అధికారులు వెల్లడించారు.