»Goas Age Old Traditional Mud Festival Celebrated On Friday
Mud Festival: బురదలో స్నానం పండగ..వైరల్ అవుతున్న వీడియో
Mud Festival: భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని ఆచార సంప్రదాయాలను ప్రజలు పాటిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేడుకలు నిర్వహించుకుంటారు. ఉత్తర గోవా(North Goa)లో కూడా అలాంటి విచిత్రమైన పండుగ జరుపుకున్నారు అక్కడ ప్రజలు.
Mud Festival: భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని ఆచార సంప్రదాయాలను ప్రజలు పాటిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేడుకలు నిర్వహించుకుంటారు. ఉత్తర గోవా(North Goa)లో కూడా అలాంటి విచిత్రమైన పండుగ జరుపుకున్నారు అక్కడ ప్రజలు. గోవాలోని మార్సెల్ అనే గ్రామంలో పిల్లలు, పెద్దలు, వృద్దులు అంతా కలిసి బురద పండుగ(Mud Festival) జరుపుకున్నారు. ఈవేడుక సందర్భంగా అందరూ బురదలో స్నానం ఆటలాడడం, ఒకరిపై మరొకరు బురదనీళ్లు చల్లుకోవడం, ఒంటికి పూసుకోవడం చేస్తారు. కొంత విచిత్రంగా అనిపించినప్పటికి దీని వెనుక పెద్ద హిస్టరీ ఉందంట. ఈపండుగ శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఆడిన ఆటలను గుర్తు చేస్తుందని చెబుతున్నారు. ఈ మట్టి పండుగను అక్కడ చిఖల్ కలో(Chikhal Kalo)అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఈ పండుగ వీడియో(Video) సోషల్ మీడియా(Social Media)లో విస్తృతంగా వైరల్ (Viral)అవుతోంది.
చిఖల్ కలో గత నాలుగు శతాబ్దాలుగా ఇక్కడ జరుపుకుంటున్నారు. ఈ పండుగను చూసేందుకు తల్లిదండ్రులు తమ నవజాత శిశువులను తీసుకువచ్చి వారి నుదిటిపై మట్టిని పూసినట్లు గ్రామస్తులు తెలిపారు. చర్మ వ్యాధులను నయం చేయడంలో ఈ మట్టి తోడ్పడుతుందని ప్రజల బలమైన నమ్మకం. గోవా టూరిజం మంత్రి రోహన్ ఖౌంటే కూడా ఈ మడ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. “గోవాలో పర్యాటక రంగానికి కొత్త అవకాశాన్ని ప్రోత్సహించడానికి మార్సెల్ గ్రామంలో ఈ ప్రత్యేకమైన చిఖల్ కలోను రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలనే నిర్ణయం” అని ఖౌంటే చెప్పారు. మనం సాంస్కృతికంగా గొప్పవారమని, ఈ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా గోవాను పర్యాటక ప్రాంతంగా గుర్తిస్తోందన్నారు. గోవాలోని ప్రకృతి అందాలు, వృక్షసంపద, జంతుజాలం కారణంగా ప్రజలు ఆకర్షితులవుతున్నారని, అంతేకాకుండా గోవాకు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆయన అన్నారు.