మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. పోలీసులు ఒక పార్టీకి తోత్తుగా మారి పార్టీ మీటింగ్ ను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం
MLA Seethakka : ప్రజా సమస్యలపై దేశం కోసం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెసేనని.. దాని అధినేతగా తమ నాయకుడు ఖమ్మం జిల్లాలోకి తొలిసారి అడుగు పెడుతుంటే.. బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి నిర్బంధిస్తున్నారని విమర్శించారు. బస్సులు, ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం అత్యంత హెయమైన చర్యగా ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. అధికారం తమ చేతిలో ఉందని ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేటు మీటింగ్ ల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకొంటున్నారని విమర్శించారు.
ఈరోజు పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకుని జనగర్జన సభను అడ్డుకోవాలని చూస్తున్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఖండించాలని కోరుతున్నట్లు సీతక్క కోరారు. ‘బీఆర్ఎస్ నాయకులారా ఇది పద్ధతి కాదు చేతిలో మీ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబడ్దార్. తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో కచ్చితంగా బుద్ధి చెబుతారు. ప్రజలు కట్టే పన్నులతో వచ్చే జీతంతో మీరు డ్యూటీలు చేస్తున్నారు. మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. పోలీసులు ఒక పార్టీకి తోత్తుగా మారి పార్టీ మీటింగ్ ను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సీతక్క పిలుపుఇచ్చారు.