పహల్గాం దాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది లష్కరే తయిబా ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది ప్రాణాలు కోల్పోగా ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది.