KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం..యశోద ఆస్పత్రికి తరలింపు
మాజీ సీఎం కేసీఆర్ కాలికి గాయం అవ్వడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు యశోద ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. నేటి సాయంత్రం ఆయన హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వైద్యులు విడుదల చేయనున్నారు.
తెలంగాణ (Telangana) మాజీ సీఎం కేసీఆర్ (KCR) తన ఇంట్లో కాలు జారి పడటంతో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని యశోద ఆస్పత్రి (Yashoda Hospital)కి తరలించారు. కాలుజారి పడిన ఘటనలో ఆయన తుంటి ఎముక విరిగినట్లుగా (Injured) సమాచారం. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు బీఆర్ఎస్ (హఇథ) వర్గాలు వెల్లడించాయి.
Former CM KCR IN HOSPITAL AFTER FALL
DOCTORS SUSPECT HIP FRACTURE, MAY REQUIRE SURGERY
FALL HAPPENED LAST NIGHT, RUSHED TO YASHODA HOSPITAL
అర్థరాత్రి కాలికి పంచె తగడలం వల్లే కేసీఆర్ (KCR) కాలుజారి పడినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. కేటీఆర్ (KTR) కుటుంబంతో పాటుగా హరీష్ రావు (Harish Rao) కూడా రాత్రంతా యశోద ఆస్పత్రిలోనే ఉన్నారు.
కేసీఆర్‌కు తీవ్ర గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి ఆయన ఇంట్లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగి గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స… pic.twitter.com/yyRosLodVt
వైద్యులు ఆయన్ని పరీక్షించి కేసీఆర్‌కు కొన్ని వైద్య పరీక్షలు చేయాలని తెలిపారు. ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్‌కు యశోద ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్లో చికిత్స కొనసాగుతోందని తెలుస్తోంది. నేడు ఆయనకు పలు పరీక్షలను వైద్యులు నిర్వహించనున్నారు. పరీక్షల తర్వాత హెల్త్ బులెటిన్ (Health Bullettin)ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.