తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ మధ్యనే దివ్య దర్శనం(Divya darshanam) టోకెన్ల జారీని టీటీడీ(TTD) ప్రారంభించడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వేసవి సెలవులు(Summer Holidays) కూడా కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. తాజాగా తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంలో అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది.
తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయానికి ఎదురుగు ఉన్న ఆస్థాన మండపంలో ఒక్కసారిగా మంటలు(Fire) చెలరేగాయి. ఆలయ ప్రాంగణంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశంలోని మ్యాట్లకు నిప్పు అంటుకోవడంతో ఈ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. భక్తులు వెంటనే స్పిందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. అయితే దర్శనానికి వచ్చిన కొందరు ఆకతాయిలే ఇలా మ్యాట్లకు నిప్పు పెట్టి ఉంటారని టీటీడీ (TTD) అధికారులు అనుమానిస్తున్నారు. మ్యాట్లకు నిప్పు అంటుకోవడంతో భక్తులు ఆందోళన చెందారు. సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.