»Fine To Biryaniwala Co Restaurant Complaint That The Rate Of Water Bottle Is High
Biryaniwala Co: రెస్టారెంట్ కు ఫైన్..వాటర్ బాటిల్ రేటు ఎక్కువ వేశారని ఫిర్యాదు
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని ఓ వ్యక్తి బిర్యానీవాలా కో(Biryaniwala Co) రెస్టారెండ్ సందర్శించి మటన్ బిర్యానీ, వాటర్ బాటిల్, శీతల పానీయం ఆర్డర్ చేశాడు. తర్వాత తిన్న క్రమంలో వారు ఇచ్చిన బిల్లు చూసి రేట్లు ఎక్కువగా వేయడం గమనించాడు. శీతలపానీయానికి రూ.45, వాటర్ బాటిల్‌కు రూ.30 ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు. దీంతో పరిశీలించిన కోర్టు వినియోగదారునికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఓ మధ్యతరగతి వ్యక్తి బిర్యానీ తిందామని బంజారాహిల్స్(banjarahills)లోని బిర్యానీవాలా కో(Biryaniwala Co) రెస్టారెంటుకు వెళ్లాడు. అక్కడ మటన్ బిర్యానీతోపాటు ఓ కూల్ డ్రింక్, ఓ వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. ఇక తిన్న తర్వాత బిల్ చూసిన అతను షాక్ అయ్యాడు. బిర్యానీ రేటు సరిగానే వేశారు. కానీ వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ ధరలను బయట ఉన్న వాటికంటే ఎక్కువగా వేశారు. దీనిపై వారిని ప్రశ్నించాడు కూడా. అయినా వారు మాత్రం అదే బిల్లు కట్టాలని పేర్కొన్నారు. దీంతో అతను ఆ బిల్లు కట్టేసిన తర్వాత వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పి)ల కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారని వినియోగదారుడు వాపోయాడు. దీనిని పరిగణలోకి తీసుకున్న జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టు బిర్యానీవాలా కో రెస్టారెంటుకు ఫైన్ వేసింది. అతనికి రూ.1015 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అంతేకాదు రెస్టారెంట్‌పై నష్టపరిహారాన్ని విధిస్తున్నప్పుడు, డ్యూయల్ MRP వసూలు చేయడం, ప్రీ-ప్యాకేజ్డ్ ఉత్పత్తులకు ముద్రించిన MRP కంటే ఎక్కువ వసూలు చేయడం తక్షణమే నిలిపివేయాలని రెస్టారెంట్‌ను కోరింది. రెస్టారెంట్ MRP కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు గుర్తించినందున, ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి మాత్రమే కాకుండా సవరించిన లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ గూడ్స్) రూల్స్, 2011ని ఉల్లంఘించడమేనని కమిషన్ తీర్పు చెప్పింది. ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పునిస్తూ, ఫిర్యాదుదారు నుంచి వసూలు చేసిన రూ.15 అదనపు మొత్తాన్ని చెల్లించిన తేదీ నుంచి రియలైజ్ అయ్యే తేదీ వరకు తొమ్మిది శాతం వడ్డీతో వాపసు ఇవ్వాలని బిర్యానీవాలా కంపెనీని కమిషన్ ఆదేశించింది. దీంతోపాటు 1,000 పరిహారం, న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని వినియోగదారుల కోర్టు రెస్టారెంట్‌ను ఆదేశించింది.
ఈ రెస్టారెంట్(Biryaniwala Co Restaurant) సరైన సేవలను అందించడం లేదని, దానికి తోడు శీతల పానీయానికి రూ.5, వాటర్ బాటిల్‌కు రూ.10 అదనంగా వసూలు చేశారని, ఇది అన్యాయమైన వ్యాపార చర్యగా భావించిన సలేష్ బిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక అప్పుడు శీతల పానీయం, వాటర్ బాటిల్ వాస్తవ MRP వరుసగా రూ.40, రూ.20 ఉన్నాయి. రెస్టారెంట్‌పై అసంతృప్తితో ఉన్న సలేష్ తగిన పరిష్కారం కోరుతూ వినియోగదారుల ఫోరంలో మార్చి 2, 2021న ఫిర్యాదు చేశాడు.