ఉత్తర నైజీరియా ప్రాంతంలోని నైబర్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. బోర్గు ప్రభుత్వ పరిధిలోని కసువాన్-డాజీ గ్రామంలోకి ఆయుధాలతో దుండగులు చొరబడి.. కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికిపైగా మృతి చెందారు. మరికొందరిని అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అపహరణకు గురైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.