»Evol Telugu Movie Has Reached The Post Production Stage
Evol: పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరిన ఎవోల్
రివర్స్ ప్రేమ కథ అనే వినూత్న కాన్సెప్టుతో వస్తున్న సినిమా ఎవోల్(Evol). ఈ మూవీ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
సూర్య శ్రీనివాస్, శివ బొద్దురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్’. (EVOL) a love story in reverse ) రామ్‌యోగి వెలగపూడి దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇద్దరు స్నేహితుల మధ్య అండర్స్టాండింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది అని దర్శక నిర్మాత రామ్‌యోగి అన్నారు. డిఫరెంట్ జోనర్ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని వెల్లడించారు. ఆర్టిస్ట్‌లంతా చక్కగా సహకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కు వెళ్లనుందని చెప్పారు. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. దర్శక నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నమిదని వెల్లడించారు.