»Elephant Bathing On Its Own Using Water Pipe Leaves Internet In Awe
Elephant bathing: నీళ్ల పైప్‌తో తనంతట తాను స్నానం చేసి అబ్బురపరుస్తున్న ఏనుగు
ఏనుగు తెలివైన జంతువు . అలాంటి ఓ ఏనుగు నీళ్ల పైప్ ను తొండంతో పట్టుకొని, తనంతట తానుగా స్నానం చేస్తున్న ఓ వీడియో ((Elephant Bathing Video) ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. జంతు ప్రేమికులను అయితే ఈ వీడియో మరింతగా ఆకట్టుకుంటుంది.
మీరు రోజాంతా లేదా సుదీర్ఘంగా పని చేసి అలసిపోతే మీకు మొదట కావాల్సింది కాస్త విశ్రాంతి. ఒక్కొక్కరికి ఒక్కో వ్యాపకం ఉంటుంది. కొంతమంది సాయంత్రం సమయంలో తమ స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చుంటారు. ఒకరికి ఇంట్లో టీవీ చూస్తూ హాయిగా విశ్రాంతి తీసుకోవడం, ఇంకొకరికి హోటల్ కో, పబ్బుకో వెళ్లడం, మరొకరికి వెబ్ సిరీస్ చూడటం, సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం వంటివి అలవాటు. మీకు సోషల్ మీడియాలో స్క్రోల్ చేసే అలవాటు ఉంటే మానసిక ఉల్లాసానికి మంచి అంశాలను, ఆహ్లాదాన్ని ఇచ్చే వీడియోలు చూస్తారు. ఇలాంటి సమయంలో మన మనస్సును కదిలించే… వినోదాన్ని అందించే.. వీడియోలు చూస్తూ ఉంటాం. కొంతమంది జంతు ప్రేమికులు ఉంటారు. వాటికి సంబంధించిన వీడియోలు చూసి ఆనందిస్తారు. అలాంటిదే ఇది. ఏనుగు తెలివైన జంతువు . అలాంటి ఓ ఏనుగు నీళ్ల పైప్ ను తొండంతో పట్టుకొని, తనంతట తానుగా స్నానం చేస్తున్న ఓ వీడియో ((Elephant Bathing Video) ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. జంతు ప్రేమికులను అయితే ఈ వీడియో మరింతగా ఆకట్టుకుంటుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. దీనిని మార్చి 11వ తేదీన ఐఎఫ్ఎస్ (Indian Forest Service) అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలతో ఆయన ఎప్పుడూ నెటిజన్లను ఆహ్లాదపరుస్తుంటారు. ఇప్పుడు మరోసారి వారిని మంత్రముగ్ధులను చేశారు. తాజాగా ఏనుగు స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘జంతువులను నిర్బంధంలో ఉంచడాన్ని నేను సమర్థించను. కానీ ఏనుగుల తెలివి తేటలకు మద్దతివ్వాలి. అద్భుతమైన ఈ జీవి.. ఇక్కడ సొంతగా స్నానం చేస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ ఏనుగు నాలుగు గోడల మధ్య బంధీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి అలాంటి పంజరం జీవితాన్ని తాను సమర్థించనని స్పష్టం చేశారు.
ఐఎఫ్ఎస్ అయిన ఆయన వన్య ప్రాణాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా (Social Media) ద్వారా పంచుకుంటారు. ఏనుగు స్నానం చేస్తున్న వీడియో తర్వాత అదే రోజు ఒడిశాలోని కేంద్రపాడ జిల్లా ఘహిర్ మాతలో మాస్ నెస్టింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టాయి. అతిథులకు స్వాగతం పలికేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.
అలాగే, ఆస్కార్ అవార్డు (Oscar Award) దక్కించుకున్న ది ఎలిపాంట్ విస్పరర్స్ (the elephant whisperer) టీమ్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా… కంగ్రాచ్యులేషన్ చెబుతూ ట్వీట్ చేశారు. అద్భుతమైన చిత్రానికి ఆస్కార్ వచ్చిందని, ఆస్కార్ అకాడమీ, అద్భుతమైన, సంగీతంతో కూడిన ఫాంటసీలతో పాటు వాస్తవ భారత అందానికి ప్రతిరూపమైన ఈ చిత్రానికి కూడా పట్టం కట్టిందని అందులో పేర్కొన్నారు. దీనిని సదరు అధికారి రీట్వీట్ చేశారు. ఒరిజినల్ ఎలిపెంట్ విస్పరర్ (The original elephant whisperer) అంటూ మరో ట్వీట్ (twitter) కూడా చేశారు.
I don’t support keeping wild in confinement, But support the intelligence of elephants…marvellous creatures. Here taking a bath on his own 😊😊 pic.twitter.com/jZvhF3OJRM