Tspsc paper leak:తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
Tspsc paper leak:తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దృష్టిసారించినట్టు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడంతో ఈడీ (ed) ఫోకస్ చేసిందని.. త్వరలో రంగంలోకి దిగుతుందని విశ్వసనీయ సమాచారం. కేసు నమోదు చేసేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. సిట్ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి.. విచారించే అవకాశం ఉంది. అక్రమ నగదు లావాదేవీ అంశాలను ఈడీ అధికారులు విచారిస్తారు. గత కొద్దీరోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ (Tspsc paper leak) అంశంపై చర్చ జరుగుతుంది.
ఆరు రకాల పేపర్లకు సంబంధించి 15 కొశ్చన్ పేపర్లు (15 question papers) లీకయ్యాయని సిట్ అధికారులు గుర్తించారు. పేపర్ లీకేజీ అంశంలో ఏ1 నిందితుడిగా ఉన్న టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్ కుమార్ (praveen kumar), ఏ2గా ఉన్న టీఎస్పీఎస్సీ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డితోపాటు (rajashekar reddy) అరెస్ట్ చేసిన 13 మందిని పోలీసులు విచారించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు లీక్ వ్యవహారం జరిగిందని గుర్తించారు.
గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్‌తోపాటు సురేష్ (suresh), రమేష్ (ramesh), రాజశేఖర్‌రెడ్డి (rajashekar reddy), షమీమ్ (shameem), ప్రశాంత్ రెడ్డికి (prashanth reddy) మాత్రమే లీక్ అయిందని చెబుతున్నారు. వీరికి తప్ప ఇంకెవరికి గ్రూప్-1 పేపర్ లీక్ అయిందనే ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని సిట్ అధికారులు తెలిపారు.