MNCL: మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలో పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురైన రైతు, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ASI మాజీద్ ఖాన్ వివరాలు ఈనెల 3న కంది ముకుంద రెడ్డి అనే రైతును పాము కాటేసింది. అప్రమత్తమైన తోటి రైతులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.