»Dil Raju Complained To The Nizamabad Police About Belgaum Film Showing In Villages
Balagam: చిత్రం గ్రామాల్లో ప్రదర్శనపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు..క్లారిటీ
బలగం(Balagam) చిత్రాన్ని కొంత మంది అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మూవీని పైరసీ చేసి గ్రామాల్లో ప్రదర్శించడంపై దిల్ రాజు(Dil Raju) పోలీసుల(police)కు ఫిర్యాదు చేశాడు. సిరికొండ గ్రామంలో బహిరంగంగా ప్రదర్శించారని అతనికి తెలియడంతో తమ ఆదాయానికి గండి పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర సమర్పకుడు దిల్ రాజు నిజామాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బలగం'(Balagam) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాన్ని కథగా తీసుకుని వేణు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ క్రమంలో బలగం సినిమాకి దిల్ రాజు(Dil Raju) నిర్మాతగా వ్యవహరించారు. మరోవైపు తెలంగాణలోని మారుమూల పల్లెల్లో బలగం చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి పలువురు దానిని పైరసీ చేసి రచ్చబండల దగ్గర, దేవాలయాలలో ఉచిత ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయని తెలిసింది.
దీంతో దిల్ రాజు పేరుతో ఓ లేఖ ద్వారా పలువురు పోలీసుల(police)ను ఆశ్రయించినట్లు బయటకు వచ్చింది. అయితే దీనిపై స్పందించిన దిల్ రాజు బలగం సినిమాను గ్రామాల్లో ప్రదర్శించడంపై అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు మరింత ఎక్కువ మంది ప్రేక్షుకులకు ఈ చిత్రం చేరడమే తమ ఉద్దేశమని దిల్ రాజు పేర్కొన్నారు. తాను ఫిర్యాదు చేసినట్లు వచ్చిన దాంట్లో నిజం లేదన్నారు.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప తదితరులు నటించిన ‘బలగం’ చిత్రం మార్చి 3న విడుదలైంది. దీనిని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. మనుషుల మధ్య చెదిరిన బంధాలు, ఆప్యాయతలను చూపిస్తూ దర్శకుడు వేణు మ్యాజిక్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సైలెంట్ గా థియేటర్లలోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ప్రస్తుతం ప్రతి ఊరిలో పల్లెటూరి ప్రజలందరినీ ఏకం చేస్తోంది.