ED questions Arvind Kejriwal's personal assistant on delhi liquor scam
ఢిల్లీలో పాత మద్యం విధానాన్ని (Delhi’s old Liquor Policy) మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది (Delhi government extended the old excise policy by six months). దీంతో ప్రభుత్వ కార్పోరేషన్లే మరో 6 నెలల పాటు మద్యాన్ని (Liquor) విక్రయిస్తాయి. గతంలోను పొడిగించారు. ఆ పొడిగింపు మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి పొడిగించడంతో… పాత విధానం సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ అధికారులు కొత్త మద్యం పాలసీపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఇటీవల కొత్త మద్యం విధానం వివాస్పదం కావడంతో పాటు సీబీఐ, ఈడీ కేసులకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త విధానాన్ని రానున్న మూడు నెలల్లో సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Chief Minister of Delhi, Arvind Kejriwal) అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు నష్టం చేసే వివాదాస్పద కొత్త మద్యం విధానం కేసుకు (Delhi excise policy case) సంబంధించి ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి (Former Delhi deputy Chief Minister) మనీష్ సిసోడియా (Manish Sisodia), అరుణ్ రామచంద్ర పిళ్లై (arun ramachandran pillai) తదితరులు అరెస్టయ్యారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఇప్పటికే ఓసారి ఈడీ విచారణకు (ed investigation) హాజరయ్యారు. నేడు మరోసారి ఈడీ ముందుకు వెళ్తున్నారు. ఆమె ఈ వ్యవహారంలో నిన్న సుప్రీం కోర్టుకు (Supreme Court) వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు.
పిటిషన్ లో కవిత ఏం చెప్పారు?
కవిత (MLC Kavitha) తరఫు న్యాయవాదులు బుధవారం అత్యవసర విచారణ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ వెంటనే విచారణకు నిరాకరిస్తూ, ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. మహిళలను వారు నివసించే చోట విచారించాలన్న సీఆర్పీసీ సెక్షన్ 160 నిబంధనలకు విరుద్ధంగా… తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత ఆ పిటిషన్ లో కోరారు. నిందితులపై ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోందని, తనను కూడా హింసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తనపై ఈడీ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలన్నారు. ఈ నెల 11వ తేదీన తాను స్వచ్చంధంగా ఫోన్ ను అప్పగించినట్లు ఈడీ స్వాధీన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని కొట్టి వేయాలన్నారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఅర్ లో తన పేరు లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొందరి ప్రోద్బలంతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిందని పేర్కొన్నారు.
పిటిషన్ లో పలు అంశాలను ప్రస్తావించారు కవిత. తాను మార్చి 10న జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు (women reservation bill) కోసం ధర్నా చేయనున్నట్లు 2వ తేదీన ప్రకటించానని, 7వ తేదీన తనకు నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 11న విచారణ సమయంలో తన ఫోన్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ కారణాలు చెప్పలేదని, అలాగే తనను రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు విచారించారని పేర్కొన్నారు. అరెస్టయిన ఇతర నిందితులతో కలిసి విచారిస్తామని చెప్పి, అలా చేయలేదని తెలిపారు. తనపై ఎలాంటి కేసు లేదని, కొందరి వాంగ్మూలం ఆధారంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కస్టడీలోని వారి నుండి బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారన్నారు. తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటానని ఈ నెల 10న పిళ్లై కోర్టును కూడా ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది. ఇతర నిందితులకు, సాక్ష్యులకు ఎదురైన పరిస్థితిని చూస్తుంటే ఈడీ తనను భౌతికంగా, మానసికంగా హింసించే ప్రమాదం ఉన్నట్లుగా అనుమానం కలుగుతోంది. ఈడీ ఎదుట హాజరైతే తనకు ప్రమాదం పొంచి ఉంది. న్యాయవాది సమక్షంలో విచారించాలి. విచారణ ప్రాంతంలో సీసీటీవీ పుటేజీని ఏర్పాటు చేయాలి.