W.G: దెందులూరు మండలం కొమునేపల్లి హైవేపై బైక్‌ని కారు ఢీకొన్న ప్రమాదంలో ముంగర పాండురంగారావు (62) మృతి చెందాడని SI శివాజీ తెలిపారు. మండవల్లి మండలం దెయ్యంపాడుకు చెందిన మృతుడు నిడమర్రు మండలం తోకలపల్లిలో బంధువు చనిపోవడంతో బైక్ పై బయలుదేరారు. సింగవరం పరిధిలో రహదారి దాటుతుండగా ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.