AP: శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ బజారులో బంగారం వ్యాపారి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్(పదో తరగతి), భువనేశ్(ఆరో తరగతి) ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా విషం తాగి ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.