ఒడిశా బాలసోర్‌లో కోరమండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ర్ రైలును ఢీ కొంది. 18 బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Coromandel Express collides with goods train in Odisha's Balasore
Odisha: ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బాహనాగ్ వద్ద కోరమండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ర్ రైలును ఢీ కొంది. 18 బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 179 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. రాత్రి 7.15 గంటలకు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది.
గూడ్స్ రైలును కోరమాండల్ రైలు వేగంగా ఢీ కొంది. దీంతో 7 బోగీలు పల్టీ కొట్టాయట. వాటిలో ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. తమను కాపాడాలని ఆర్తించారు. ప్యాసెంజర్స్ ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మిన్నంటింది. రైలు బోగీలు పల్టీలు కొట్టడం.. కొందరు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. ఇప్పటివరకు అయితే మృతుల విషయానికి సంబంధించి అప్ డేట్ ఇవ్వలేదు. భారీ సంఖ్యలో చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ కూడా చేరుకొని పర్యవేక్షిస్తున్నారు.
క్షతగాత్రులను తరలించేందుకు భద్రక్ నుంచి ఐదు అంబులెన్స్‌లు తరలించారు. బాలేశ్వర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నంబర్ 06782262286కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.