»Central Government Good News Free Aadhaar Update From March 15th To June 14th 2023
UIDAI Good News: ఫ్రీగా ఆధార్ అప్డేట్..జూన్ 14 వరకు అవకాశం
ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏమిటంటే ఇకపై ఆధార్(Aadhaar) కార్డ్ అప్ డేట్(update) కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సౌకర్యం మార్చి 15 నుంచి జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో అప్ డేట్ చేసుకోవాలనుకునేవారు వినియోగించుకోవాలని సూచించారు.
మీరు ఆధార్ కార్డు(Aadhaar card) అప్ డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్(uidai Good News). ఎందుకంటే మై ఆధార్ పోర్టల్‌లో ఉచితంగా ఆధార్ అప్డేట్ సర్వీస్ అందుబాటులో ఉందని UIDAI స్పష్టం చేసింది. ఈ సర్వీస్ మార్చి 15 నుంచి జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అయితే ఆధార్ కార్డు అప్ డేట్ కోసం గతంలో 25 నుంచి 50 రూపాయలు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఫీజు లేకుండానే ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చని ప్రకటించారు.
ఆధార్ సంబంధిత విషయాలు, పరిణామాలను పర్యవేక్షిస్తున్న భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ మేరకు ప్రకటించింది. ఈ చర్య ద్వారా లక్షలాది మందికి “ప్రయోజనం” కలగనుందని వెల్లడించింది. 2009లో ఆధార్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ కార్డ్ కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే దాదాపు 1,200 ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సేవల కోసం ఆధార్ ఆధారిత గుర్తింపును ఉపయోగిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
ఈ సందర్భంగా UIDAI, myAadhaar పోర్టల్‌లో ఉచిత ఆధార్ నవీకరణ సేవ(services) అందుబాటులో ఉందని తెలిపింది. మరోవైపు ప్రతి పదేళ్లకోసారి ఆధార్ వివరాలను తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం వెల్లడించింది. myAadhaar పోర్టల్‌ని ఉపయోగించడం కూడా చాలా సులభమని చెప్పింది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్ లింక్ చేసి నిర్ధారించుకోవాలని కేంద్రం తెలిపింది. ప్రజలు తమ ఆధార్ నంబర్‌తో లాగిన్ కావచ్చని.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుందని చెప్పారు. కేవలం ‘డాక్యుమెంట్ అప్డేట్’పై క్లిక్ చేసి వివరాలు ధృవీకరించి అప్ డేట్(update) చేయాలని వెల్లడించారు. గుర్తింపు రుజువు, చిరునామా పత్రాలను నవీకరించడానికి వాటి కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. జనాభా వివరాలను (పేరు, పుట్టిన తేదీ, చిరునామా) మార్చాల్సిన అవసరం ఉన్నట్లయితే, నివాసితులు సాధారణ ఆన్లైన్ అప్డేట్ సేవను ఉపయోగించవచ్చు లేదా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చని పేర్కొన్నారు.