అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42.79 కోట్ల మేర మోసం చేశారనే అభియోగాలపై అరెస్ట్ చేసింది. మంగళవారం రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు.
విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరిట రుణం తీసుకుని ఎగ్గొట్టారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ గతంలోనే సీబీఐకి ఫిర్యాదు చేసింది. పలు వివరాలను సీబీఐ ఫిర్యాదులో పేర్కొంది. వీటి ఆధారంగా ఇదివరకే సీబీఐ విచారణ ప్రారంభించింది.
గతంలోనే విశ్వేశ్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డైరెక్టర్లతోపాటు కొత్తపల్లి గీత, ఆమె భర్తకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. కాగా కొత్తపల్లి గీతను ప్రశ్నించి ఈ రోజు సాయంత్రం(బుధవారం) సాయంత్రంలోగా కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. మరోవైపు ఆమె భర్త భర్త రామకోటేశ్వరరావుపై కూడా రుణ ఎగవేత ఆరోపణలు ఉండడంతో అతడిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.