AMVI పరీక్ష రద్దు చేయడి.. టీఎస్ పీఎస్సీ చైర్మన్‌ను కోరిన అభ్యర్థులు
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పరీక్ష ఈ నెలలో జరగనుంది. ఆ కొశ్చన్ పేపర్ నిందితుడు ప్రవీణ్ కుమార్ పెన్ డ్రైవ్‌లో ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షను రద్దు చేయాలని కోరుతున్నారు.
Cancel AMVI exam:తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీ (paper leak) అంశం ప్రకంపనలు రేపుతోంది. లీకేజీకి సంబంధించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దర్యాప్తు సంస్థ సిట్ (sit) విచారిస్తోంది. మొత్తం 4 పేపర్లు (papers) లీక్ కాగా.. ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (amvi) పరీక్ష ఈ నెలలో జరగనుంది. ఆ కొశ్చన్ పేపర్ కూడా నిందితుడు ప్రవీణ్ కుమార్ (praveen kumar) పెన్ డ్రైవ్‌లో ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
ఎంవీఐ (amvi) పరీక్ష కూడా వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని (janardhan reddy) కలిసి.. విన్నవించారు. లేదంటే తాము నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. పేపర్ లీక్ ఘటనలో లక్షల రూపాయలు చేతులు మారాయి. ఈ ఘటనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు పేపర్ లీకేజీకి సంబంధించి టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి స్టేట్ మెంట్‌ను సిట్ రికార్డ్ చేయనుంది.