E.G: కడియం మండలంలోని దుళ్ల గ్రామంలో ముసునూరి వెంకట సూర్యనారాయణమూర్తి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని సుమారు 6 కేజీల వెండి, 40 కాసుల బంగారం, సుమారు రూ.1,50,000 నగదు చోరీకి గురైనట్లు బాధితులు కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఏ. వెంకటేశ్వర్లు, క్లూస్ టీం పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు.