NLR: మనుబోలు మండల కేంద్రంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో సోమవారం ఉదయం పూరిల్లు దగ్ధమైంది. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న అంబి సుబ్బయ్య అనే వ్యక్తి ఆ మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయిందా లేక మరే ఇతర కారణాల వల్ల కాలిపోయిందా తెలియాల్సి ఉంది. పూరిల్లు తగలబడిపోతుండడంతో స్థానికులు గుర్తించి మంటలను ఆర్పి వేశారు.