Lead-Trail:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడ్లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్ ముగిసే వరకు హస్తం పార్టీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ప్రస్తుతం ఉన్న ఇన్ఫో ప్రకారం 132 చోట్ల లీడ్లో ఉంది.
షిగ్గావ్లో సీఎం బసవారాజు బొమ్మై లీడ్లో ఉన్నారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకపురలో లీడ్లో ఉన్నారు. బళ్లారి రూరల్లో శ్రీరాములు, వరుణలో సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారు. మరోసారి కింగ్ మేకర్ అవుదామని అనుకున్న కుమారస్వామి చెన్నపట్నంలో వెనుకంజలో ఉ్ననారు. బళ్లారిలో గాలి అరుణలక్ష్మీ కూడా వెనకబడి పోయారు.
కర్ణాటక ఎన్నికల్లో 8 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల్లో సిట్టింగులకు బీజేపీ సీట్లు ఇవ్వలేదు. దీంతో మెజార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. అలాగే బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి.. ప్రభుత్వ వ్యతిరేకత కమల దళానికి శాపంగా మారింది. అవే ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 131 చోట్ల లీడ్లో ఉంది. బీజేపీ 78 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 14 చోట్ల మాత్రమే తన సత్తా చాటింది.