తమిళ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు2(Bichagadu2 Movie) ఈరోజు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రిమీయర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకలు అభిప్రాయం సహా ట్విట్టర్ రివ్యూను ఇప్పుడు చుద్దాం.
2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాంతో చాలా కాలం తర్వాత బిచ్చగాడు 2 మూవీతో ఈరోజు(మే 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటోని. ఆ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా విజయ్ ఆంటోని(vijay antony) తీసుకున్నాడు. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ సహా టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఈ క్రమంలో తమిళ్, తెలుగు భాషలో నేడు విడుదలైన ఈ మూవీని ప్రిమీయర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం సహా ట్విట్టర్ రివ్యూను ఇప్పుడు చుద్దాం.
#Bichagadu2 First half report: 1st half has thriller elements that engages audience. Missing lip sync is an annoying point though. First half ends with an interesting twist and now th3 fate of the movie depends on how much the 2nd half engages. For live updates and review follow…
— TeluguBulletin.com (@TeluguBulletin) May 19, 2023
ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ అందంగా కనిపించాడని ఓ వ్యక్తి పేర్కొన్నారు. అంతేకాదు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని పేర్కొన్నారు. దీంతోపాటు ఫాస్టాఫ్ అదిరిందని వెల్లడించారు.