బెంగళూరు – వారణాసి ఇండిగో విమానం (Bengaluru-Varanasi IndiGo flight makes emergency landing in Telangana) తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బెంగళూరు నుండి వారణాసి మధ్య నడిచే ఇండియో విమానం 6E897ను సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ విమానంలో 137 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరు కూడా క్షేమంగానే ఉన్నారు. నివేదికల ప్రకారం భాగ్యనగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Rajiv Gandhi International Airport-RGIA) అత్యవసర ల్యాండింగ్ కోసం పైలట్ అడిగారు. ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు భాగ్యనగరంలో ల్యాండ్ అయింది.
బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఇండిగో విమాం 6E897 శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) వెల్లడించింది. సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని శంషాబాద్ వైపు మళ్లించినట్లు చెప్పారు. ఈ మేరకు డీజీసీఏ (DGCA) విచారణకు ఆదేశించింది. ప్రయాణీకులను మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.