VZM: సారాడవలస గ్రామంలో ఆదివారం సాయంత్రం వరి నూర్చే గల్లా మిషన్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. వరి పంట నూర్చుతున్న సమయంలో యంత్రం నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా ట్రాక్టర్‌తో పాటు వరి నూర్చే గల్లా మిషన్ మంటల్లో చిక్కుకుంది. సమీపంలో ఉన్న మూడున్నర ఎకరాల వరి పంట అగ్నికి ఆహుతయ్యిందని బాధితులు తెలిపారు.