PLD: నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడుకు చెందిన రైతు మీసాల నాగేశ్వరరావు తన మిర్చి పంటను కల్లంలో అరబెట్టాడు. గుర్తుతెలియని దుండగులు సుమారు 15 క్వింటాళ్ల మిర్చి చోరీకి పాల్పడ్డారని మంగళవారం తెలిపాడు. ఆరుగాలం కష్ట పడి పంట పండించి కల్లాలలో ఆరబెడితే దొంగలు అపహరించుకు పోతున్నారని వాపోయాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.