Viral video: ఈ ఆటో చాలా లగ్జరీ గురూ..ఎక్కడో తెలుసా?
ఇది ఆటో(auto) కాదు..ఇదో అద్బుతం. అందులో అన్ని స్పెషల్ యే..ఎటు చూసిన అద్బుతాలే. ఎక్కడ చూసిన రంగురంగు లైట్లే. ఎక్కడ కూర్చున్న లగ్జరీ సీట్లే. ఇదో అందాల ఆటో. అవును ఈ ఆటో అన్ని ఆటోలలా కాదు. చూస్తే కళ్లు చెదిరిపోయే వస్తువుతో నిర్మితమైన ఆటో. ఇదో హైటెక్ ఆటో. మీరు కూడా ఓ సారి ఈ హైటెక్ ఆటోపై ఓ లుక్కేయండీ మరి.
బెంగళూరు(Bengaluru) రోడ్లపై ఓ స్పెషల్(special) ఆటో(auto) పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టిని ఆకర్షింపజేస్తుంది. ప్రయాణికులకు అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఆటో ఇప్పుడు ఊరు ఊరంతా చక్కర్లు కొడుతుంది. ఇటివల కూలర్ ఆటో చూసాం. ఇప్పుడు దానికి మించిన ఆటో రోడ్లపై తిరుగుతుంది. దానిని చూసిన ప్రతి ఒక్కరు ఆ లగ్జరీ ఆటోలో ఎక్కాలని మొగ్గుచూపిస్తున్నారు. అయితే ఆ ఆటో విషేశాలు తెలుసుకుందాం.
ఓ ఆటో డ్రైవర్ భిన్నంగా ఆలోచించాడు. తన ఆటోని డిఫరెంట్గా తయారు చేయించాడు. ఇటీవల కాలంలో చాలామంది ఆటో డ్రైవర్లు(drivers) ఆటోలను అప్ గ్రేడ్ చేస్తున్నారు. వేసవికాలంలో కస్టమర్లు ఇబ్బంది పడకుండా…ఆటో వెనుక భాగంలో కూలర్ అమర్చి అందర్నీ ఆకట్టుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ఇక బెంగళూరులో కొత్తగా వచ్చిన హైటెక్ ఆటో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. ఈ ఆటోలో గాజు కిటికీలు..రెండు ఫ్యాన్లు .. ఖరీదైన సీట్లు ప్రత్యేకంగా అందరిని ఆకట్టుకుంటాయి. ఇంకా ట్రే టేబుల్స్ తో పాటు మరిన్ని ఏర్పాట్లతో తయారు చేయబడింది ఆ ఆటో.
ఇక ఆ ఆటోలో దివంగత నటులు శంకర్ నాగ్, పునీత్ రాజ్ కుమార్ పోస్టర్లు కూడా ఉన్నాయి. స్టీరింగ్ వీల్ పక్కన ఒక రకమైన డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది. ఇంకా ఆ ఆటో రంగు రంగుల లైట్లతో మెరిసిపోతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇక ఇందులో ప్రయాణించిన వారు..ఫోటో..వీడియోలను కొందరు నెట్టింట పోస్ట్ చేయడంతో ఈ లగ్జరీ ఆటో(auto) గురించి నెట్టింట చర్చ మొదలైంది.