»Asked About The Print Of Question Papers Previously A Joke Now Reality In Telangana Governor Tamilisai Soundararajan
Tamilisai Soundararajan: ప్రశ్నపత్రాల ప్రింట్ గురించి అడిగారు..గతంలో జోక్..ఇప్పుడు వాస్తవం
ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్(question papers print) చేస్తున్నారో చెప్పగలరా అని ఒక విద్యార్థి(student) తనను అడిగిన విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai Soundararajan) ప్రస్తావించారు. ఇది గతంలో జోక్ కానీ ప్రస్తుతం వాస్తవమని గవర్నర్ వెల్లడించారు.
ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారో చెప్పగలరా అని ఒక విద్యార్థి తనను అడిగిన విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Tamilisai Soundararajan) ప్రస్తావించారు. ఇది గతంలో ఒక జోక్, కానీ అది ఇప్పుడు తెలంగాణలో వాస్తవమైందని అన్నారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రం లీక్ కుంభకోణంపై విరుచుకుపడ్డారు. దీంతో చాలా నిరుత్సాహపడినట్లు గవర్నర్ తెలిపారు. కూకట్ పల్లి(kukatpally) హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్(JNTU) యూనివర్శిటీ 11వ స్నాతకోత్సవానికి ఆమె హాజరైన క్రమంలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో గతంలో తనకు జరిగిన ఓ అనుభవాన్ని గుర్తుచేశారు. ఓ సమయంలో తాను బోధించిన వైద్య కళాశాలలో జరిగిన సంఘటనను వివరించారు. ఆ సమయంలో పరీక్షలకు ఒక రోజు ముందు, ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే అడగాలని విద్యార్థులకు చెప్పినట్లు తెలిపారు. అప్పుడు ఓ విద్యార్థి లేచి ప్రశ్నపత్రాలు(question papers) ఎక్కడ ప్రింట్(print) చేస్తారో చెప్పాలని అడిగినట్లు గవర్నర్(Telangana Governor) వెల్లడించారు. అయితే గతంలో ఇది జోక్ అని, కానీ ప్రస్తుతం తెలంగాణ(telangana)లో నిజంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఎక్కువగా ఫోన్లపై డిపెండ్ అవుతున్నట్లు చెప్పారు. ఇంకోవైపు ఎగ్జామ్స్ హాజరైన విద్యార్థులకు థాంక్స్ చెప్పే పరిస్థితి వస్తుందని వెల్లడించారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు(students) చదువుతోపాటు(study) మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని గవర్నర్ కోరారు. సరికొత్త టెక్నాలజీని యువత సరియైన క్రమంలో ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతోపాటు మహిళలు కూడా రీసెర్చ్ రంగంపై మరింత ఫోకస్ చేయాలని కోరారు. మరోవైపు ప్రస్తుత సమాజంలో లింగ వివక్ష కూడా ఉందని అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలని, ఆత్మహత్యలకు పాల్పడి ఆయా కుటుంబాల్లో విషాదం నింపొద్దని సూచించారు.