»Anchor Suma Son Roshan Entry As Hero First Look Release Dj Look
Anchor Suma Son:రోషన్ హీరోగా ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్
యాంకర్ సుమ(Anchor Suma) కనకాల, నటుడు రాజీవ్ కనకాల(rajiv kanakala) కుమారుడు(son) రోషన్ కనకాల(Roshan kanakala) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రోషన్ పుట్టినరోజును పురస్కరించుకుని అతను నటిస్తున్న చిత్రంలోని పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు(ravikanth perepu) దర్శకత్వం వహిస్తున్నారు.
స్టార్ యాంకర్ సుమ(Anchor Suma), నటుడు రాజీవ్ కనకాల(rajiv kanakala) కుమారుడు(son) రోషన్(Roshan) ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరో శ్రీకాంత్ తన కొడుకు రోషన్‌తో కలిసి ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో కూడా నటించాడు. ఆ తర్వాత చదువుపై దృష్టి సారించాడు. చదువుల కోసం అమెరికా వెళ్లిన రోషన్ ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలో త్వరలో రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఏ సినిమా, ఏ నిర్మాణం అనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంది. ఈ క్రమంలో మార్చి 15న రోషన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా గురించి ఓ ప్రకటన ఇచ్చారు.
హీరోగా అరంగేట్రం చేస్తున్న రోషన్(Roshan) ఫస్ట్ లుక్(first look) పోస్టర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో రోషన్ గిరజాల జుట్టుతో సన్ గ్లాసెస్ ధరించి DJ సిస్టమ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. కొడుకు లుక్‌ని పంచుకుంటూ సుమ ఆశ్చర్యపోయింది. ‘ఎట్టకేలకు మీ కల నెరవేరింది రోషన్’ అని సుమ(suma) తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
సంశయం, కృష్ణా అండ్ హిస్ లీల వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్ పేరేపు(ravikanth perepu).. రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రం రూపొందుతోంది. పి.విమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, నవీన్ యాదవ్ కెమెరా వర్క్‌ను సమకూరుస్తున్నారు. విష్ణు కొండూరు, సెరి-గన్ని, వంశీ కృష్ణ స్క్రీన్‌ప్లే రాశారు. ప్రొడక్షన్ డిజైన్ని శివమ్‌రావు నిర్వహించారు.