అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్(Hero Akhil) నటించిన ఏజెంట్ మూవీ(Agent Movie ).. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదలైంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు. ఈ సందర్భంగా ఈ చిత్రం హిట్టా ఫట్టా ఓ సారి తెలుసుకుందాం.
సినిమా – ఏజెంట్
నటీనటులు – అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, తదితరులు
దర్శకుడు – సురేందర్ రెడ్డి
నిర్మాత – రామబ్రహ్మం సుంకర
సంగీత దర్శకుడు – హిప్ హాప్ తమిజా
సినిమాటోగ్రఫీ – రసూల్ ఎల్లోర్
ఎడిటర్ – నవీన్ నూలి
విడుదల తేదీ – ఏప్రిల్ 28, 2023
అక్కినేని అఖిల్(Akkineni Akhil) నుంచి వస్తోన్న మరో సినిమా ఏజెంట్ (Agent). చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. గతంలో అఖిల్(Akhil) నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
కథ
పి.రామకృష్ణ రిక్కీ (అఖిల్ అక్కినేని) ఒక హైపర్యాక్టివ్ యువకుడు, ఎథికల్ హ్యాకర్. అతను గూఢచారి కావాలనుకుంటాడు. ఏ రోజుకైనా దేశానికి సేవ చేయాలని అనుకుంటాడు. కానీ RAW చేత మూడుసార్లు తిరస్కరించబడతాడు. ఆ క్రమంలో అతను RAW చీఫ్ మహదేవ్ అకా ది డెవిల్స్ (మమ్ముట్టి) సిస్టమ్‌ను ఒకసారి హ్యాక్ చేస్తాడు. అదే నేపథ్యంలో భారతదేశాన్ని నాశనం చేయడానికి ఓ పెద్ద ప్లాన్ వేసిన గాడ్(డినో మోరియా) ప్రణాళికను చేధించి, అతని అరాచకాలు అడ్డుకోవాలని భావించి డెవిల్ ఓ సారి ఫెయిల్ అయితాడు. అదే క్రమంలో రెండో సారి ఆ టాస్కును రిక్కీకి అప్పగిస్తాడు. అయితే అసలు ఈ మిషన్ లో గాడ్ ఎవరు? డెవిల్తో రిక్కీకి సంబంధం ఏమిటి? విక్కీ అతని మిషన్‌ను ఆపివేస్తాడా లేదా? తరువాత ఏం జరిగిందనేది అసలు స్టోరీ.
ఎవరెలా చేశారు
బ్యాక్ టు బ్యాక్ రెండు సాఫ్ట్ మూవీల తర్వాత, ఏజెంట్ తో అఖిల్ అదిరిపోయే పర్మ్ మెన్స్ ఇచ్చాడు. అతను సిక్స్ ప్యాక్‌తో విభిన్నమైన కేశాలంకరణతో స్టైలిష్‌గా కనిపిస్తాడు. యాక్టింగ్ విషయానికి వస్తే, ఏజెంట్లో అఖిల్ విచిత్రమైన, వైల్డ్ క్యారెక్టరైజేషన్‌ని ఎంచుకున్నాడని చెప్పవచ్చు. అయితే కొందరు దీన్ని ఎక్కువగా ఇష్టపడవచ్చు. మరికొంత మందికి మాత్రం వర్క్ అవుట్ కాదు. అఖిల్ కూడా తెలంగాణ స్లాంగ్‌ని భాగాలుగా ట్రై చేశాడు. సాక్షి వైద్య కమర్షియల్ ఔటింగ్ కోసం పెట్టారు తప్ప స్క్రీన్ పై తనకు పెద్దగా స్కోప్ లేదు. గ్లామరస్‌గా కనిపించడం, హీరోతో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం మినహా ఆమెకు ఏమీ లేదని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఆమె కనిపించకుండా పోవడం, ఎవరూ పట్టించుకోకపోవడం కూడా సినిమాలో ఆమె పాత్రకు మైనస్సే. ఏ ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ అయినా చేయగలిగే పాత్రలో మమ్ముట్టి కనిపిస్తారు. ఓవర్ ది టాప్ యాక్షన్ సెటప్‌లో అతను కన్విన్సింగ్‌గా కనిపించడం లేదు. డినో మోరియో విలన్‌గా నటించడం పర్వాలేదు. వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ చిన్న పాత్రలో ఒదిగిపోయింది. సంపత్, సత్య సహా ఇతరులు వారి క్యారెక్టర్ల మేరకు నటించారు.
సాంకేతిక అంశాలు
దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్‌ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అతను అతన్ని బాగా ప్రదర్శించాడు. కానీ ఫస్ట్ హాఫ్ తర్వాత చాలా ఎంగేజింగ్‌గా ఉండాల్సిన సెకండాఫ్‌లో కథను బాగా నేరేట్ చేయడంలో డైరెక్టర్ విఫలమయ్యాడనిపిస్తుంది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉంది. హిప్హాప్ తమిజా సంగీతం కూడా అంతే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని పార్ట్‌లలో బాగానే ఉంది. కానీ చాలా వరకు బిగ్గరగా ఉందనే చెప్పవచ్చు. సెకండాఫ్‌లో నవీన్ నూలి చాలా అనవసరమైన పోరాట సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సిందనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.