స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? అవును. తాజాగా ICON STAR అల్లు అర్జున్ గురించి ఆహా(aha) ఓ ట్వీట్(tweet) చేసిన క్రమంలో ఫ్యాన్స్ ఆ సర్ ప్రైజ్ ఏంటని తెగ ఆలోచిస్తున్నారు. ఆహా మార్చి 15న సాయంత్రం అల్లు అర్జున్ ని మీరు మాస్ గా, క్లాస్ గా చూసి ఉంటారు. ఈసారి మాత్రం ఒక బ్లాక్ బస్టర్ లుక్ తో ఆహాలో మీ ముందుకు వస్తున్నాడని తెలిపింది. ది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ కోసం సిద్ధంగా ఉండాలని తెలిపింది. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ అనౌన్స్మెంట్ ఎంటని రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులకు సరికొత్త సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ వారి ఓటీటీ(OTT) ప్లాట్ ఫాం అయిన ఆహా(aha)లో ఓ ప్రత్యేక కార్యక్రమం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు చిత్రాలను చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరో..మరోవైపు ఓటీటీలో డిజిటల్ వినియోగదారులకు కూడా దగ్గర కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆహా ఓటీటీలో ఓ కార్యక్రమంలో నటించనున్నట్లు తెలిసింది. అయితే అందుకు సంబంధించి ఆహా బృందం ఓ ట్వీట్ చేసింది.
ICON STAR Allu Arjun ni meeru mass ga, class ga choosi untaru, eesari oka blockbuster look tho aha mee mundu ki teskoni raabothundi… Get ready for 'The Biggest' Announcement! Any guesses?😉@alluarjun#AlluArjun𓃵pic.twitter.com/iwjn7Xf3bE
ఆ ట్వీట్లో ICON STAR అల్లు అర్జున్(Allu Arjun)ని ఇప్పటివరకు మీరు మాస్ గా, క్లాస్ గా చూసి ఉంటారు. కానీ ఈసారి ఒక బ్లాక్ బస్టర్ లుక్ తో ఆహా మీ ముందుకు తీసుకురాబోతుంది. ది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఆహా అల్లు అర్జున్ చిత్రాన్ని పోస్ట్ చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. షూస్, జీన్స్ వేసుకుని ఓ డాన్స్ స్టెప్పు వేస్తున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు అల్లు అర్జున్ నిజంగా స్పెషల్ షో చేస్తున్నారా? అన్ స్టాపబుల్ షో, లేదా ఏదైనా షోకి గెస్టుగా వస్తున్నారా? అని పలురకాలుగా ఆలోచిస్తున్నారు. అయితే ఆ అనౌన్స్ మెంట్ ఎంటో గెస్ చేయాలని ఆహా టీం అభిమానులను కోరింది. దీనిపై పలువురు నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే ఆహా(aha) నుంచి ఇండియన్ ఐడల్ 2, అన్ స్టాపబుల్ వంటి స్పెషల్ షోలు వచ్చాయి. దీంతోపాటు స్టాండప్ కామెడీ షో, డాన్స్ ఐకాన్ షోలు కూడా ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గెస్టుగా వస్తున్నాడా? లేదా మరొకటి ఏదైనా స్పెషల్ షో చేయబోతున్నాడా అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఇంకోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీని చేస్తున్నారు. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.