మిల్క్ బ్యూటీ అదితి రావ్ హైదరి(Aditi Rao Hydari) తాజాగా కేన్స్ వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఫొటో షూట్లో దిగిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. వాటని చూసిన హీరో సిద్ధార్థ్ తోపాటు నెటిజన్లు కూడా పలు రకాలుగా కామెంట్లు చేశారు. అసలు వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారో ఇక్కడ చుద్దాం.
స్టార్ హీరోయిన్ అదితి రావ్ హైదరి స్కై బ్లూ డ్రైస్ ధరించిన లేటెస్ట్ ఫొటో షూట్ చిత్రాలను పంచుకుంది.
తన ఇన్ స్టా ఖాతాలో Nice to meet you again Cannes అంటూ బ్లూ కలర లవ్ సింబల్ పెట్టి చిత్రాలను ట్యాగ్ చేసింది. కేన్స్ వెళ్లిన క్రమంలో అక్కడ దిగిన చిత్రాలను ఈ మేరకు పోస్ట్ చేసింది.
ఆ క్రమంలో చిత్రాలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు మూడు లక్షల మంది లైక్ చేశారు.
ఇది కూడా చూడండి: Samyukta menon: లిప్స్ ఓపెన్ చేసిన విరూపాక్ష బ్యూటీ..సిగ్నల్ ఇచ్చేసిందా!
ఈ ఫొటోలపై హీరో సిద్ధార్థ్ కూడా స్పందించారు. ఓ మై..అని లవ్ సింబల్ తో చూస్తున్న ఎమోజీతోపాటు మంటల ఎమోజీని యాడ్ చేసి కామెంట్ చేశారు.
ఈ చిత్రాలు చూసిన మరికొంత మంది డ్రెస్ అదుర్స్, వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ అమ్మడు ప్రస్తుతం సైలెంట్ గాంధీ టాక్స్, లయనెస్ అనే చిత్రాల్లో యాక్ట్ చేస్తుంది. దీంతోపాటు హీరమండి అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేస్తుంది.
గతంలో అదితి రావ్ హైదరీ(Aditi Rao hydari), హీరో సిద్ధార్థ్(Siddharth)తో లవ్ లో ఉందని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా(social media)లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, త్వరలో పెళ్లి(marriage) కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వారి రిలేషన్ షిప్ గురించి ఎక్కడా వీరిద్దరూ నోరువిప్పలేదు.
నిజానికి అదితి రావుకు ఇదివరకే పెళ్లయింది. సిద్ధార్థ్‌కు కూడా ఇదివరకే పెళ్లయింది. ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఇచ్చి ఇప్పుడు సింగిల్‌గా ఉంటున్నారు. అలాగే.. సిద్ధార్థ్ ప్రస్తుతం ఓ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడని శర్వానందే అన్‌స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.