ADB: బాసర గోదావరి నదిలో సోమవారం ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వయస్సు సుమారు 65 సంవత్సరాల ఉంటుందని, మృతుడు నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ వాసిగా గుర్తించారు.