SDPT: రిమ్మనగూడ వద్ద జాతీయ రహదారిపైఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.