»A Claim Of Rs 16 Crores Against The Delta Airlines For Causing Trouble By Sitting In The Next Seat
Trouble: పక్క సీట్లో కూర్చుని ఇబ్బందిపెట్టారని..ఎయిర్ లైన్స్ పై రూ.16 కోట్ల దావా
విమానంలో ఓ వ్యక్తి తనతోపాటు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించినా కూడా అతనిపై చర్యలు తీసుకోలేదని ఓ మహిళ ఓ విమానయాన సంస్థపై రూ.16 కోట్ల దావా వేసింది. ఈ సంఘటన ఇటివల వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలెంటో చుద్దాం.
న్యూయార్క్ లోని జేఎఫ్‌కే ఎయిర్ పోర్టు నుంచి గ్రీస్ లోని ఏథెన్స్ కు జులై 26, 2022లో డెల్టా ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. ఆ క్రమంలో ఫ్లైట్‌లో మద్యపానం సేవించిన ఓ వ్యక్తి 16 ఏళ్ల అమ్మాయి, ఆమె తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడని..ఆ క్రమంలో విమానయాన సిబ్బంది అతనిపై చర్యలు తీసుకోలేదని ఓ మహిళ కోర్టులో 16 కోట్ల రూపాయలకు దావా వేసింది. ఈ సంఘటన ఇటివల వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణించిన తొమ్మిది గంటలు తాము నరకం చుశారమని ఆమె తెలిపింది.
తన కుమార్తె పక్క సీట్లో కూర్చున్న అతను కుమార్తె వివరాలు అడగడం, తాకి ఇబ్బందులకు గురిచేసినట్లు ఆమె చెప్పింది. ఆ క్రమంలో అతనితో వారించినందుకు తల్లిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించాడని వెల్లడించింది. అంతేకాదు అడ్డువచ్చిన మరికొంత మంది ప్రయాణికులపై కూడా అరిచాడని చెప్పింది. అయితే ఇదంతా జరుగుతున్నా కూడా ఫ్లైట్ సిబ్బంది మాత్రం పెద్దగా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. ఆ నేపథ్యంలో చివరకు అతని సీటు మార్చడంతో కొంత మేరకు ఉపశమనం కల్గిందని తెలిపింది. కానీ అతనిపై మాత్రం చర్యలు తీసుకోలేదని, తర్వాత కూడా అతనికి విమానయాన సిబ్బంది మద్యం సప్లై చేశారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతనితోపాటు విమానయాన సంస్థపై చర్యలు తీసుకోవాలని ఫెడరల్ స్టేట్ కోర్టులో ఆమె తన 16 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ $2 మిలియన్ల దావా వేశారు.