A case has been registered against Bhuvanagiri Congress MP Chamala Kiran Kumar Reddy
Chamala Kiran Kumar Reddy: భువనగిరి పార్లమెంట్(Bhuvanagiri Parliament) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి( Congress MP candidate) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy)పై భూ కబ్జా కేసు నమోదు అయింది. తుర్కయాంజల్‌లోని 200 గజాల ప్లాట్‌ను కబ్జా చేశారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదిబట్ల పోలీసు స్టేషన్ రాధిక అనే మహిళ కేసు నమోదు చేశారు. దీంతో ఆదిభట్ల పీఎస్‌లో సెక్షన్ 447, 427, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ప్లాటును కిరణ్ కుమార్ రెడ్డి, రాధిక ఇద్దరు కొన్నట్లు వాళ్ల దగ్గర డాక్యుమెంట్లు సైతం ఉన్నట్లు ఆదిబట్ల స్టేషన్ సీఐ తెలిపారు. ఇది సివిల్ కేసు కాబట్టి డాక్యుమెంట్లు పరిశీలించి కేసును కోర్టుకు వెళ్తుందని తెలిపారు.