GDL: ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ డీసీఎం టైరు పగలడంతో ప్రమాదవశాత్తు శనివారం బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి తాడిపత్రికి వెళ్తున్న ఈ డీసీఎం రైలింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. లారీలో ఉన్న డ్రైవర్ అష్రఫ్, మరో డ్రైవర్ ఖాదర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.