KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు నుంచి ఆదోని వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.