HYD: తుర్కయంజాల్ మున్సిపాలిటీ రాగన్నకూడా వద్ద బైక్ – కార్ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి వేగంగా వచ్చిన బైకర్స్.. కారు ఢీ కొట్టడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపటి వరకు రోడ్డంతా ట్రాఫిక్‌తో నిండిపోయింది. గాయాలైన వారిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.