బిహార్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బక్సర్ జిల్లా సారెంజాపూర్ గ్రామంలో మట్టి పెళ్లలు కూలి నలుగురు బాలికలు ప్రాణాలు విడిచారు. ఇంటి కోసం మట్టి తవ్వుతుండగా ఆరుగురు బాలికలపై పెళ్లలు పడ్డాయి. వెంటనే పెళ్లలను తవ్వి బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు శివాని, సంజ్, నైన్తారా, సరితగా గుర్తించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.