SRD: అందోల్ మండలోని అన్నాసాగర్ గ్రామం చౌరస్తా వద్ద స్తంభానికి బైక్ ఢీకొని ఇద్దరికీ గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పైజాబాద్కు చెందిన యువకులు ముగ్గురు బైక్‌పై వెళుతుండగా అన్నాసాగర్ స్మశానవాటిక ముందు బైక్ అదుపు తప్పి స్థంభానికి ఢీకొట్టింది. శ్రీకాంత్, బాబులు తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.