విశాఖ ఎన్ఏడీ ప్రాంతంలో యువకుడు దిలీప్‌పై దాడి జరిగింది. స్నేహితులతో మద్యం సేవించిన తర్వాత బాలరాజు, రమణ వెళ్లిపోగా దిలీప్ రక్తమడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పాత కక్షలే కారణమని భార్య చంద్రిక అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో అనుమానితులను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.