రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లోని ఔషధ దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు తనిఖీలు చేశారు. 115 దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు డీసీఏ డీజీ షానవాజ్ ఖాసిం తెలిపారు. నిబంధనలు పాటించనందుకు ఆయా దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.